పైలెట్ రోహిత్‌రెడ్డి దోషి!
- 34 లక్షల చెక్ బౌన్స్ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు
- మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్
రంగారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ము ఖ్య నేత పైలట్ రోహిత్‌రెడ్డికి నాంపల్లి న్యా యస్థానంలో బిగ్ షాక్ తగిలింది. రూ.34. 23 లక్షల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ఆయనను నాంపల్లి కోర్టు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. గతంలో కుదుర్చుకున్న ఆర్థిక ఒప్పం దాలు, లావాదేవీల నేపథ్యంలో రోహిత్‌రెడ్డి బాధితుడికి రూ.34.23 లక్షల విలువైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెక్కును జారీ చేశారు.
అయితే, ఆయన ఖాతాలో తగినంత నిధులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. అ నంతరం బాధితుడు లీగల్ నోటీసులు పంపి నా స్పందన రాకపోవడంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వి చారణ సందర్భంగా రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. రోహిత్ రెడ్డి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం చేస్తూ ఆయనను దోషిగా తేల్చింది.
తీర్పు వెలువడే సమయానికి మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కోర్టుకు హా జరుకాకపోవడం గమనార్హం. ఆయన గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన న్యాయస్థా నం, వెంటనే ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి ప్రత్యక్షంగా కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాతే ఈ కేసులో ఆయనకు విధించే జైలు శిక్ష లేదా జరిమానాను ఖరారు చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.






