1 September, 2026 | 2:45 AM

కీరవాణి బలగంలోకి కోడలిగా..!

01-09-2026 01:33 AM

కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరు చెబితే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ‘బలగం’(Balagam) సినిమాలో ప్రియదర్శి మరదలు అంటే అందరూ ఠక్కున గుర్తుపట్టేస్తారు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘మాసూద’లోనూ హీరోయిన్‌గా కుర్రకారును ఆకర్షించింది.

ఈ సినిమాల సంగతి కాస్త పక్కనపెడితే కావ్య కళ్యాణ్‌రామ్ త్వరలో సంగీత దర్శకుడు కీరవాణి బలగంలోకి కోడలిగా అడుగుపెట్టనుందని తెలుస్తోంది. కీరవాణి తనయుడు, గాయకుడు కాలభైరవతో కావ్య ప్రేమలో ఉందంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా తమ బంధంపై స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది కావ్య. “మన జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఎంతో అందంగా కనిపిస్తుంది. కొందరు మన జీవితంలోకి అడుగుపెట్టాక, దేవుడు మనపై ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అర్థమవుతుంది.

నా సాధారణ రోజులను కూడా ఎంతో ప్రత్యేకంగా, సంతోషంగా మార్చినందుకు కాలభైరవకు ధన్యవాదాలు. నన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా భావించేలా చేశారాయన. తాను వద్దని పైకి చెప్పినా, నాకు డైట్ కోక్ కావాలనే విషయాన్ని ఆయన ముందే గ్రహిస్తారు. ఇద్దరి మధ్య ఉండే ఇలాంటి చిన్న చిన్న మధుర క్షణాలు జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నా” అంటూ పోస్ట్ చేసింది.