22 May, 2026 | 11:36 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

12-03-2026 01:00 AM

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, మార్చి 11(విజయక్రాంతి): కాలనీ పరిసరాలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఐదవ రోజు సందర్భంగా జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో బుధవారం గోల్నాక డివిజన్ పరిధిలోని తులసి నగర్ కాలనీలో ప్రత్యేక (ఈవేస్ట్) సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని కాలనీలోని పార్క్‌ను సందర్శించి పరిసర ప్రాం తాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలు, కాలనీ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ కాలనీ పరిసరాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసి అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అలా గే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగం గా చేపడుతున్న ఈవేస్ట్ సేకరణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమ న్నారు. ప్రజ లు కూడా ఇలాంటి కార్యక్రమాలకు సహకరించి తమ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ మారు తి దివాకర్, డీఈఈ (శానిటేషన్) రఘు, జీహెచ్‌ఎంసీ డీఈఈ ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఏ తిరుపతి, యూబీడీ సంతోష్, శ్రీధర్, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.