18-02-2026 12:27:07 AM
కోయిల్ కొండ/ రాజాపూర్ ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మది న వేడుకలు మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు కోయిలకొండ రాజాపూర్, జడ్చర్ల దే వరకద్ర తో పాటు అన్ని మండల కేంద్రాల లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ని ర్వహించారు.
కెసిఆర్ జన్మదిన సందర్భంగా జాతీయ రహదారి ముఖ్య కూడలిలో కేక్ క ట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ నాయకులు బ చ్చిరెడ్డి నరసింహులు, సత్తయ్య,రమేష్ నా యక్, ఆనంద్ గౌడ్ నజీం బేగ్, శ్రీనివాస్, ఆల్ఫాఫ్, యాదగిరి, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.