calender_icon.png 18 February, 2026 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

18-02-2026 12:28:19 AM

రాజాపూర్, ఫిబ్రవరి 17: గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్ర భుత్వం ప్రజా బాట కార్యక్రమం ద్వారా స మస్యలు పరిష్కరిస్తున్నామని ఏడీఈ నవీన్ కుమార్, ఏఈ వెంకటేష్ తెలిపారు. మంగళవారం తిర్మలాపూర్ గ్రామంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న రెం డు ట్రాన్స్ఫార్మర్స్ షిఫ్టింగ్, చేయాలని తెలిపారు.

శిథిలావస్థలో ఉన్నపాత స్థంబాల తొ లగించి నూతన స్థంబాల ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో రైతుల పొలాల్లో లూజ్ వైర్లను సరిచేసి విద్యుత్ సమస్యలు త లెత్తకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచంద్ర, పంచా యతీ కార్యదర్శి భరత్ కుమార్,కాంగ్రెస్ పా ర్టీ గ్రామ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, లైన్ ఇన్స్పెక్టర్ సోమేశ్,లైనమెన్ మైనొద్దీన్, వార్డ్ మెంబెర్ మంజుల రాజు, పోలేపల్లి యాదయ్య చుక్క నర్సింలు, చాకలి లింగం కృష్ణ, శ్రీహరి, యాదయ్య, శేఖర్ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.