4 July, 2026 | 9:58 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 04:09 PM

సిర్పూర్,(యు),(విజయక్రాంతి): మండల కేంద్రంలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం మండల పార్టీ అధ్యక్షులు తొడసం ధర్మారావు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ ఆత్రం భగవంత్ రావు ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని  పురస్కరించుకొని  కేక్ కట్ చేసి  ఒకరికొకరు తినిపించుకున్నారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... అభివృద్ధి,సంక్షేమాలకు చిరునామాగా తెలంగాణను నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ గతంలో కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన సంక్షేమం సేవలు కావాలని అన్నారు.ప్రజల దీవెనలతో కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  సర్పంచులు ఆత్రం ఓమ్ ప్రకాష్, కొమురం భీంరావు,జైన్నూర్ సింగల్ విండో చైర్మన్ కొడప హన్ను పట్టేల్, మాజీ ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి,బీ ఆర్ ఎస్ నాయకులు అర్క నాగోరావ్,కోవా నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.