calender_icon.png 17 February, 2026 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అస్తిత్వ శిఖరం... కేసీఆర్

17-02-2026 04:18:53 PM

- కేసీఆర్ జన్మదినం సందర్భంగా కిడ్నీ వ్యాధిగ్రస్తునికి రూ.లక్షా 22వేల ఆర్థిక సహాయం అందజేత

- మున్సిపల్ లో అన్నదానం పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ లు

గజ్వేల్: కేసీఆర్ జన్మదిన సంబరాలు  గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ కి నిండు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజా సేవలో ముందుకు వెళ్లాలని ప్రార్థించారు. గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో  మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి, వైస్ ఛైర్మన్ కల్యాణ్ కార్ నర్సింగరావు  పాలక వర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ, ఇందిరా పార్క్ చౌరస్తాలో అన్నదానం నిర్వహించారు.

పలుచోట్ల, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడు సల్లూరి మహేష్ కు వంటేరు ప్రతాపరెడ్డి రూ. 50వేలు, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రూ.72వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ తిరుగులేని ప్రజా నాయకునిగా  తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన మనసున్న మానవతావాది కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రారస్తున్నామన్నారు. గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధితో రాష్టానికి మార్గదర్శనం చేసి రోల్ మొడల్గా నిలిపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,అరుణ,జఖి ఉద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవాని, భాగ్యలక్ష్మీ, శ్రీధర్, అత్తెల్లి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్ లు,  రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి స్వామి, బ్యాగారి ప్రభాకర్, నాయకులు బలమని,  మద్ది రాజిరెడ్డి,కృష్ణా రెడ్డి, రగుపతి రెడ్డి,  రమేష్ గౌడ్, శివ,స్వామి,  మల్లేశం, బిమప్ప, అహ్మద్,దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కనక గౌడ్, భాను, చందు, బూరన్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.