12 May, 2026 | 9:22 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

పార్టీ నుంచి కవిత సస్పెన్షన్

03-09-2025 12:32 AM
  1. క్రమశిక్షణ ఉల్లంఘన కింద వేటు
  2. ప్రకటన విడుదల చేసిన బీఆర్‌ఎస్

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత విషయంలో బీఆర్‌ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ స్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్, ప్రధానకార్యదర్శి టీ రవీందర్ రావు పేర్లతో ఓ ప్రకటనను బీఆర్‌ఎస్ విడుదల చేసింది.

‘ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధక్షులు చంద్రశేఖర్ రావు.. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

ఇదిలా ఉం టే కవిత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ లైన్ దాటి కవిత పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తన తండ్రికి రాసిన లేఖను కావాలనే కొం దరు లీక్ చేశారని, కేసీఆర్ వెంట దె య్యాలు ఉన్నాయని గతంలో ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కూడా ఆమె బహిరంగ విమర్శలు చేశారు.

తాజాగా కాళే శ్వరం రిపోర్టుపై స్పందిస్తూ.. హరీశ్‌రా వు, సంతోష్‌రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో ఫామ్‌హౌజ్‌లో సమావేశం నిర్వహించి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.