ఏండ్ల నిరీక్షణకు తెర
-కొత్త కార్డుదారులకు డబుల్ బొనాంజా
-రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ షురూ..
మహబూబాబాద్, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి) : ఏండ్ల తరబడిగా కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షించిన లబ్ధిదారుల కల సోమవారం నెరవేరింది. రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా రేష న్ కార్డులు మంజూరు చేయడంతో పాటు సోమవారం నుండి కొత్త కార్డుదారులకు, అదనంగా నమోదైన వారికి సన్నబి య్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది.
మహబూబా బాద్ జిల్లా వ్యాప్తంగా 558 రేషన్ షాపుల ద్వారా 2 లక్షల 43 వేల కార్డులకు 4,804 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. గత జూన్, జూలై, ఆగస్ట్ నెలలకు కలిపి మొత్తం కోటా రేషన్ బియ్యం 14,414.034 మెట్రిక్ టన్నుల బి య్యం జూన్ నెలలో ఒకేసారి పంపిణి చేశారు. 31,052 కొత్త కార్డులు, 41,095 మెంబెర్ ఆడిషన్ కార్డులు మొత్తం కలి పి 72,147 కొత్తగా మంజూరయ్యాయి.
కొత్తగా రేషన్ కార్డు పొందినవారు, అదనంగా నమోదైన వారికి రేషన్ బియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ తదితర సౌకర్యాలను పొందే అవకాశం దక్కింది. ఇంతకాలం నిరీక్షణ తర్వాత రేషన్ కార్డు ఇవ్వడం, సన్న బియ్యం పంపిణీతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ కలను నిజం చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రేషన్ కార్డు కల నెరవేరింది
నా వివాహం జరిగిన తర్వాత నేను మా ఆయనతో కలిసి కొత్త రేషన్ కార్డు కోసం పది సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాం. 10 ఏళ్లుగా రేషన్ కార్డు కోసం అధికారులను, ప్రజాప్రతినిధులను అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చారు. కార్డు ఇవ్వడమే కాకుండా నాకు, నా భర్త సురేందర్, ఇద్దరు పిల్లలు ఆరాధ్య, శ్రీరక్షన్ కు 6 కిలోల చొప్పున 24 కేజీల సన్న బియ్యం ఈరోజు తీసుకున్నాను. కొత్త రేషన్ కార్డు ద్వారా మా కుటుంబానికి భరోసా ఏర్పడింది. 10 ఏళ్ల నిరీక్షణ అనంతరం రేషన్ కార్డు కల ఇన్నాళ్లకు నెరవేరింది.
వంగ గౌతమి, తాళ్లపూసపల్లి, మహబూబాబాద్ జిల్లా






