‘స్థానికం’పై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన
- ఇంచార్జి నియామకంపై ఉత్కంఠ
-ముగ్గురికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో అధిష్టానం
కరీంనగర్, సెప్టెంబరు 2 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేష న్ ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నది. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి నియా మకంలో జాప్యం చేస్తుండడంతో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలతోపాటు కరీంనగర్ నగరపాలక సంస్థలో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు.
తమకు బి ఫారం ఇచ్చే నాయకుడు ఎవరవుతారోనని తెలియక ఇంచార్జి పదవి ఆశిస్తున్న వారి చుట్టూ, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ నెలకొన్న గ్రూపుల కారణంగా ఎన్నికలు పూర్తయ్యే వరకు ముగ్గురికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ పరిస్థితి ఈ నియోజకవర్గంలో దయనీయంగా ఉం ది. ఉమ్మడి జిల్లా పరిదిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతుండగా కరీంనగర్ నియోజకవర్గం లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది.
కరీంనగర్ ఇం చార్జి పదవిని ఆశిస్తున్న ప్రస్తుత కరీంనగర్ పార్లమెంట్ ని యోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్రా వు కొత్తపల్లి వద్ద ప్రత్యేక కార్యాలయాన్ని ఏ ర్పాటు చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తనకు అసెంబ్లీ నియోజకవర్గ ఇం చార్జి పదవి ఇస్తే మరింత పటిష్టం చేయడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కేలా చూస్తానని అధిష్టానానికి చెప్పారు. అలాగే ఆయన గెలుపు గుర్రాలపై ప్రత్యేకంగా సర్వే కూడా చేయిస్తున్నారు.
ఇదిలా ఉంటే సుడా చైర్మన్, ప్రస్తుత నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రతిపక్షాల ఆరోపణలకు ఎప్పటిక ప్పుడు కౌంటర్లు ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. అధిష్టానం ఇంచార్జి బాధ్యతలు అప్ప గిస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో నాయకుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఇంచార్జి స్థానాన్ని ఆశిస్తున్నారు.
వీరితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొన్నటి వరకు ఇంచార్జిగా వ్యవహరించి నస్సెన్షన్ కు గురైన పురుమల్ల శ్రీనివాస్ మళ్లీ పార్టీలో కొనసాగాలనే ఆలోచనతో అధిష్టానం పెద్దలను కలిసి వస్తున్నా డు. ఆయన కూడా నియోజకవర్గ ఇంచార్జి ఆశలో ఉన్నారు. పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పీసీసీ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్ కూడా ఇం చార్జి పదవి ఆశలో ఉన్నారు.
అయితే ఇక్కడ గ్రూపు రాజకీయాలు ఎక్కువ కావడం, కొం దరు మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులుగా, కొందరు మంత్రి శ్రీధర్ బాబు అను చరులుగా ఉండడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఇంచార్జి నియామకంలో జాప్యం చేస్తున్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే రెండువర్గాల నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసేందుకు వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరిని, బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరిని ఇంచార్జీలుగా చూస్తున్నట్లు తెలిసింది.






