రూ.1.50 లక్షల కర్ణాటక లిక్కర్ పట్టివేత
సీఐ బానోత్ పటేల్ 55 మద్యం బాటిళ్లు స్వాధీనం
సికింద్రాబాద్, ఆగస్టు21 (విజయక్రాం తి): అమీర్పేట్ సీఐ బానోత్ పటేల్ సిబ్బంది కలిసి ఎస్‌ఆర్ నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని తనికే చేయగా మద్యం బాటిల్లు ఉండటంతో ప ట్టుకున్నారు. అతని వద్ద ఉన్న నాలుగు మద ్యం బాటిళ్లు కర్ణాటక చెందిన ప్రీమియం లిక్క ర్ గా గుర్తించారు. ఈ విషయంపై ఆరా తీ యగా కే.గోవర్ధన్ రెడ్డి(46) అతని వద్ద నుం చి తీసుకున్నట్లు గుర్తించారు.
నిందితు ఇచ్చిన సమాచారం మేరకు గోవర్ధన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా 51 మద్యం బాటిల్లు వివి ధ రకాలైన కర్ణాటక డిఫెన్స్ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.కర్ణాటక నుంచి డిఫెన్స్ మ ద్యం బాటిల్లను తక్కువ ధరకు తెచ్చి ఒక్కొక్క బాటిల్ పై రూ.300 నుంచి రూ.500 లకు లాభాలు తీసుకుంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం లో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బానోత్ పటేల్ తెలిపారు.పట్టుకున్న మద్యం విలువ రూ.లక్షన్నరగా ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆపరేషన్‌లో వాణి, రా ధ, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






