22 August, 2026 | 5:06 AM

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

22-08-2026 01:11 AM

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

అశ్వరావుపేట ఆగస్టు 21 (విజయక్రాంతి): అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీలలో భాగంగా  అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను శుక్రవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్లో వివిధ వర్టికల్స్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. పేకాట, కోడిపందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచి,  కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన  దొంగతనం కేసుల వివరాలను  అడిగి తెలుసుకొని, పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించడంతో పాటు, దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని సూచించారు.

చోరీకి గురైన ఆస్తి రికవరీపై ప్రత్యేక దృష్టి సారిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.   యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోలట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్112కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి వేగంగా చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్, సీఐ నాగరాజు, ఎస్త్స్రలు యయాతి రాజు, రాజేష్  పాల్గొన్నారు.