11 April, 2026 | 4:51 PM

సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత

11-04-2026 03:06 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి  గ్రామంలో పాడిరైతు సూర ఎల్లవ్వ-రాజుల కూతురు శిరీష వివాహం సందర్భంగా కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టెలు అందజేశారు. నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని వరకట్నంగా పుస్తెమట్టెలు అందించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి భానుచందర్ రెడ్డి మాట్లాడుతూ... కరీంనగర్ డెయిరీ సంస్థ పాడి రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అందులో భాగంగా కళ్యాణమస్తు పథకం ద్వారా ఆడబిడ్డల వివాహాలకు పుస్తెమట్టెలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సారంపల్లి  పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు కోలా బాలయ్య, డైరెక్టర్లు గుగ్గిళ్ల శ్రీనివాస్, వంగపెల్లి శ్రీనివాస్, బరిగేలా నర్సయ్య, గాదం మల్లేశం, సెక్రటరీ గుగ్గిళ్ల రాజు, బరిగేలా జగదీష్ తదితరులు పాల్గొన్నారు.