7 July, 2026 | 6:31 PM

Breaking News

జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి   •   విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •  

మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి

11-04-2026 03:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): రబీ సీజన్ లో రైతులు పండించిన మొక్కజొన్నను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్ధతు ధరను పొందాలని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి అన్నారు. శనివారం మార్కెట్ యార్డులో రైతులకు టోకెన్లను జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు వ్యవసాయ శాఖ మంత్రికి విన్నవించగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు.