11 May, 2026 | 10:49 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

డాక్టర్ లేని కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి

03-12-2025 09:41 PM

పట్టించుకోని అధికారులు..

డాక్టర్ లేకపోవడంతో మొన్న పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన ఇక్కడే..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి బుధవారం రోజు డాక్టర్ లేక మూసి ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో ఉన్న గూర్రేవుల గ్రామానికి చెందిన ధర్మయ్యను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ డాక్టర్, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఖాళీ గదులే దర్శనమిచ్చాయి. అత్యవసర సమయాల్లో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కుటుంబం తప్పనిసరిగా 40 కి.మీ దూరంలోని ఏటూరునాగారం 108 వాహనంలో తరలించడం జరిగింది. 

కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు బాగలేకపోవడంతో ప్రజలు ప్రభుత్వం, పాలన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాము కాటు కారణంగా ఇటీవల ఓ బాలుడు మృతి చెందిన ఘటనలో కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు లేకపోవడం, పాము కాటుకి విరుగుడు ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడం ఆరోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. విమర్శల నేపథ్యంలో సంబంధిత డాక్టర్ ను బదిలీ చేసి జిల్లా యంత్రాంగం చేతులు దులుపుకున్నారు అయిన కూడా కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎలాంటి మార్పు లేకపోవడం ప్రజలను మరింత నిరాశకు గురిచేస్తోంది.