11 May, 2026 | 10:49 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకున్న అందాల భామలు

11-05-2026 09:47 PM

హైదరాబాద్, మే 11: వచ్చే వారం జరగబోయే మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటున్న అందాల భామలు స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించుకున్నారు.  అలివేలు పార్టిసిపెంట్స్ కు తెలంగాణ సాంస్కృతిక వైభవం గురించి తెలియజెప్పే ఉద్దేశంతో పోటీల నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు ఆలయ దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వీరందరినీ వేదప్రవచనాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ విశిష్టత గురించి వివరించారు. మే 17న హైదరాబాద్ వేదికగా మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఫౌండర్  కిరణ్మయి అలివేలు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఆడిషన్స్ లో విభిన్న రంగాలకు చెందిన 60 మందికి పైగా మహిళలు, యువతులు, మోడల్స్ పాల్గొన్నారు.30 మంది ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇది కేవలం అందం మాత్రమే కాకుండా, మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ అవగాహన మరియు మానసిక స్థైర్యాన్ని ప్రోత్సహించే వేదికగా ఫౌండర్ కిరణ్మయి తెలిపారు. ఈ కార్యక్రమం మహిళలు తమలోని ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక వేదికగా నిలుస్తోందన్నారు.