ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం
11-05-2026 09:26 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): రాత్రి ఇంటికి లేటుగా ఎందుకు వస్తున్నావని తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన ఓ కుమారుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళి అదృశ్యమయ్యాడు. బాలాజీనగర్ ముత్తుస్వామికాలనీలో బిస్వకర్మ అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. కుమారుడైన టీకారం బిశ్వకర్మ(20) ఈ నెల 9న రాత్రి ఇంటికి లేటుగా వచ్చాడు.ఎందుకు ఆలస్యంగా ఇంటికి వస్తున్నావని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన టీకారం బిశ్వకర్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






