11 May, 2026 | 10:41 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం

11-05-2026 09:16 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): తాగి ఇంటికి వచ్చాడని తల్లి మందలించడంతో మనస్థాపం చెందిన ఓ తనయుడు ఇంటి నుంచి బయలకు వెళ్ళి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్లోని నందమూరినగర్ లో నిషా నలుగురు కుమారులతో కలిసి జీవనం సాగిస్తుంది. చిన్న కుమారుడైన రబ్బానీ అన్సారీ(26)కు వివాహం కాలేదు.

అంబేద్కరనగర్లో పంచర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8న మద్యం తాగి ఇంటికి రావడంతో తల్లి నిషా కుమారుడిని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన కుమారుడు రబ్బానీ అన్సారీ ఇంట్లో చెప్పకుండ బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. అతని అచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.