30 May, 2026 | 1:36 AM

పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్

30-05-2026 12:08 AM

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్

నిజాంసాగర్, మే 29 (విజయక్రాంతి): కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద ఇంటి ఆడపిల్లలకు  వరం లాంటి దని జుక్కల్ శాసనసభ్యులు కోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. శుక్రవారం నాడు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, నాయకులు మంద బలరాం, గుర్రపు శ్రీనివాస్, పి జనార్దన్ రెడ్డి, బంగ్లా ప్రవీణ్,, నారాయణ, నందాస్ మోహన్, గౌస్ పటేల్, మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.