ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు
కోదాడ: కోదాడ పరిధిలోని శనగల రాధాకృష్ణ దివ్యాంగుల ఆశ్రమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర జాగృతి గిరిజన వైస్ ప్రెసిడెంట్ భూక్య సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమంలోని దివ్యాంగులకు అన్నదానం నిర్వహించి, కేక్ పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు దివ్యాంగులతో కలిసి సమయం గడిపి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాజ సేవలో ముందుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఆమె జన్మదిన వేడుకలను దివ్యాంగుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు వీరగాని సాయి, బిసి మహిళా జిల్లా అధ్యక్షురాలు గీత, బానోతు వాసు, శేఖర్ రెడ్డి, మోతే మండల యువజన అధ్యక్షులు ధరావత్ కృష్ణ, బూరుగడ్డ రఘు, రాము మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.




