3 July, 2026 | 9:30 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

కుభీర్ లో కార్తీక దీపార్చన

07-10-2025 07:54 PM

స్థానిక శ్రీ విఠలేశ్వర ఆలయంలో కాకడ హారతి కార్యక్రమం ప్రారంభం..

కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని మరో పండరిపురంగా ప్రసిద్ధి చెందిన శ్రీ విఠలేశ్వర ఆలయంలో మంగళవారం కార్తీక దీపార్చనలో భాగంగా తెల్లవారుజామున కాకడ హారతి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ పూజారులు ప్రమోద్ జోషి, రాజు మహారాజ్ లు విట్టల రుక్మిణి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాల సమర్పణ అనంతరం కాకడ హారతి కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ బి పెంటాజి ప్రారంభించారు. భక్తులు నెయ్యితో చేసిన కాగడాలను చేతబూని వాటిని వెలిగించి స్వామివారికి హారతిని ఇస్తారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెల్లవారుజాము నుండి కుభీర్ తో పాటు పరిసర గ్రామాల భక్తులు పెద్దసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గత ఎన్నో ఏళ్లుగా స్వామివారికి కార్తీక మాసంలో నెలరోజులపాటు కాకడార్తి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బి సునీల్, పుప్పాల పీరాజి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.