3 July, 2026 | 8:32 PM

Breaking News

కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •  

మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

07-10-2025 07:57 PM

కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి చెందిన ముచ్చిండ్ల గణేష్(23) అనే యువకుడు తాగుడికి బానిసై జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఏ కృష్ణారెడ్డి తెలిపారు. గత కొంతకాలంగా గణేష్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన ఇరుగుపొరుగు వారు కుటుంబీకులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఆయనను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించగా అక్కడి దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.