24 August, 2026 | 4:51 AM

విద్యుత్ ప్రమాదంలో జూనియర్ లైన్ మెన్‌కు తీవ్ర గాయాలు

24-08-2026 02:45 AM

దండేపల్లి, ఆగస్టు 23: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మోకాసిగూడెం స్టేజి వద్ద ఆదివారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో జూనియర్ లైన్ మెన్ మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఆనుకొని ఉన్న చెట్టు కొమ్మలను తొలగించేం దు కు మహేందర్ స్తంభం ఎక్కాడు.

ఈ క్రమం లో అనుకోకుండా విద్యుత్ షాక్ తగలడంతో అతను స్తంభంపై నుంచి కింద పడి పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచా రం అందించారు. గాయపడిన మహేందర్ను చికిత్స నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.