26 May, 2026 | 2:18 AM

మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

26-05-2026 12:35 AM

నిజాంసాగర్ మే 25(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు ధనసరి అనసూయ (సీతక్క) ను సోమవారం నాడు హైదరాబాద్లోని వారి నివాసంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  జుక్కల్ నియోజకవర్గ ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సానుకూలంగా చర్చించారు.

జుక్కల్ నియోజకవర్గానికి తగినన్ని నిధులు కేటాయించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క పేర్కొన్నారు.  ఆయన వెంట అమెరికా ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి  పాల్గొన్నారు.