జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం పాదయాత్ర
కల్లూరు,(విజయక్రాంతి): ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం పాదయాత్ర చేయడం బాధాకరమని,అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని బీఆర్‌ఎస్, జనసేన,సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే జర్నలిస్టులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన పాదయాత్ర గురువారం కల్లూరు మండల కేంద్రానికి చేరుకుంది. అంబేద్కర్ విగ్రహానికి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి. రాజశేఖర్,జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి మూడేళ్లుగా కాలయాపన చేస్తోందని విమర్శించారు. వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి హామీలను అమలు చేయాలని కోరారు.కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పొట్రూ అర్జున్‌రావు మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కట్ట అజయ్‌బాబు,లక్కినేని రఘు, మేకల కృష్ణ, జనసేన నాయకుడు నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు షేక్ ఉస్మాన్, ఉబ్బన రాంబాబు,సీఐటీయూ నాయకుడు వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు గంగుల గోపి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, దాసరి డేవిడ్, సాంబశివరావు, జానపాటి రోజ్ వేణు,కోట పుల్లయ్య,టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి. రాజశేఖర్,జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, టిబిజేఏ జిల్లా కార్యదర్శి మానుకొండ రవికిరణ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నలబోల మధుశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.ఎస్. చక్రవర్తి, సీనియర్ జర్నలిస్టు మారెడ్డి నాగేందర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు,కొరకొప్పుల రాంబాబు,పీజీబీఏ కెమెరామెన్స్ జిల్లా కార్యదర్శి భూక్య గణేష్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు అర్షద్,నాయకులు గంగుల గోపి, మందా శరత్,చిర్రా పవన్, పెరుమాళ్లపల్లి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.






