27 August, 2026 | 10:22 PM

పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్‌

27-08-2026 06:22 PM

అలంపూర్ ఆగస్టు 27: జాతీయ రహదారి గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పుల్లూరు టోల్‌ ప్లాజా పరిసర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ అస్తవ్యస్తంగా మారింది.టోల్‌ ప్లాజాకు సమీపంలోని పలు హోటళ్ల వద్ద వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హోటళ్లకు వచ్చే లారీలు, కార్లు, ఇతర వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇరువైపులా వాహనాలు నిలిపివేయడం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలకు మార్గం ఇరుకుగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. టోల్‌ ప్లాజా పరిసరాల్లో  రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ప్రమాదాలు చోటు చేసుకునేలోపే సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలని స్థానికులు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.