13 March, 2026 | 9:00 AM

జర్నలిస్టులకూ క్యాష్‌లెస్ వైద్యం అందించాలి

13-03-2026 01:12 AM
  1. ఇన్సూరెన్స్ ప్రీమియం భరించాలి

సీఎస్ రామకృష్ణారావుకు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే వినతి 

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత (క్యాష్‌లెస్) వై ద్యం అందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరా బాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కె.రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిం చాలని వారు కోరారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణా రావును టీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, హెచ్‌యూజే అధ్యక్షులు బి.అరుణ్ కుమార్, కార్యదర్శి బి.జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బి. రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ బయ్యా దా మోదర్, జాయింట్ సెక్రటరీ క్రాంతి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా పలు జర్న లిస్టుల సమస్యలపై చర్చించి ఆయనకు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం సర్కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ పరిధిలోకి జర్నలిస్టులను కూడా తీసుకురావాలని వారు కోరారు. పరిమితిలేని ఉచిత వైద్య సేవలను జర్నలిస్టుల కు వర్తింపజేయాలని, ఇందుకోసం అవసరమైన ప్రీమియంను ప్రభుత్వమే బీమా సంస్థలకు చెల్లించాలని సూచించారు. సరైన వై ద్యం అందక, ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టుల కుటుంబాలు పడుతున్న అవస్థలను సీఎస్ దృష్టికి నేతలు తీసుకెళ్లారు.

ఈ అం శంపై జర్నలిస్టు సంఘాలతో త్వరలోనే ప్రత్యే క సమావేశం నిర్వహించాలని కోరారు. దీ నికి సీఎస్ రామకృష్ణారావు సానుకూలంగా స్పందించారు. సీఎం దృష్టికి సమస్యలను తీసుకుపోతామనని హామీనిచ్చారు. ఈ సందర్భంగా హెచ్‌యూజే రూపొందించిన మీడియా డైరీ-ని ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణకు సంఘం ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ అందించారు.