24 May, 2026 | 2:24 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

24-05-2026 12:06 AM

కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, స్టేట్ సెక్రటరీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి కొమ్ముల ప్రవీణ్‌రాజ్ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయ కులు పలువురు శనివారం హైదరాబాద్‌లోని టీఆర్పీ కార్యాలయంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరా రు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై బహుజనుల ఆత్మగౌరవం, రాజ్యాధికార స్థాపనే లక్ష్యంగా టీఆర్పీ నిరంతరం పోరాడుతోందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుండి మరింత బలోపేతం చేయడానికి చేరికలు ఎంతో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు తాళ్ల రవీందర్, కోఆర్డినేటర్ లింగం యాదవ్, మరియు పా ర్టీలో చేరిన నాయకులు పానుగంటి విఠల్, భాస సంతోష్, ఠాక్రే మహేంద్ర, కోటావారు సాయికృష్ణ, కామ్రే మనోజ్, డొకే విఠల్, భగత్ ప్రకాష్, ఈరగొల్ల దత్తాత్రి పాల్గొన్నారు.