జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి
ఎంకెఆర్ ప్రిన్సిపల్ రమావత్ రవి నాయక్
దేవరకొండ,(విజయక్రాంతి): జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎంకెఆర్ ప్రభుత్వ డిగ్రీలో జాబ్ మేళా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రమావత్ రవి నాయక్ అని అన్నారు. దేవరకొండ పట్టణంలోని మంగళవారం యంకేఆర్ కళాశాల (అటానమస్)లో భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి నాయక్ మాట్లాడుతూ... ప్రముఖ ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ‘ప్రొడక్షన్ ట్రైనీ’ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్(టీఎస్కేసి) సహకారంతో ఈ నియామక ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు.
ఈ జాబ్ మేళాకు దేవరకొండ డివిజన్ పరిసర ప్రాంత నిరుద్యోగ యువత 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు రాము చౌహన్ ఎల్ఐసి దేవరకొండ సీనియర్ మేనేజర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇలాంటి జాబ్ మేళాను విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు. జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని ఎం ఎస్ ఎన్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి కోటయ్య, టీఎస్ కేసి కోఆర్డినేటర్ సి.లింగమయ్య మెంటర్ ఆర్ శివకృష్ణ, వి యాదయ్య, అధ్యాపకులు విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




