వార సంతకు వేలం
24-03-2026 05:39 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ చునర్కర్ సతీష్ ఆధ్వర్యంలో వారసంతకు వేలం నిర్వహించారు. వేలం పాటలో ఇద్దరు పాల్గొనగా రూ.9.51 లక్షలకు శంకర్ దక్కించుకున్నాడు. గాతేడాది రూ.8.49 లక్షలు పల్కగా ఈసారి రూ.1 లక్ష 2 వేలు అధికంగా గ్రామ పంచాయతీకి ఆదాయం పెరిగింది. ఈ కార్యక్రమంలో వాంకిడి ఉప సర్పంచ్ దీపక్ ముండే, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, బిల్ కలెక్టర్ గోవిందు, కారోబార్ శంకర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




