24 March, 2026 | 8:54 PM

కల్లూరు నుండి హైదరాబాద్‌కు బస్సు సర్వీస్

24-03-2026 07:12 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ డిపో ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీ నుండి కుంటాల మండలం కల్లూరు నుండి హైదరాబాద్ కు సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు ప్రతి రోజు రాత్రి 9.45 ని.లకు కల్లూరు నుండి  బయలుదేరి నర్సాపూర్ (జి) నుండి రాత్రి 9:55 దిలవార్ పూర్ నుండి రాత్రి 10.05 ని.లకు నిర్మల్ నుండి రాత్రి 10.45 ని.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 03.50 ని.లకు హైదరాబాద్ చేరుకుంటుందని ఆయన తెలిపారు.

ఈ బస్సు 4 మండలాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్ (జి), దిలవార్ పూర్ మండల ప్రజలు (ప్రయాణికులు) ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని డిపోమేనేజర్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కొరకు tgsrtcbus.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. రిజర్వేషన్ లో ఏమైనా సందేహాలు ఉంటే 7382842394 ఈ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవలని ఆయన తెలిపారు.