కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
24-03-2026 07:16 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జనకాపూర్లోని శ్రీ కోదండరామాలయం వద్ద మంగళవారం మున్సిపల్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ మున్సిపల్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వేడుకల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.




