క్షయ వ్యాధి నిర్ములనకు కృషి
వాంకిడి,(విజయక్రాంతి): క్షయ వ్యాధి నిర్మాణపు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆయే షా, డాక్టర్ రియాజ్ పేర్కొన్నా రు. మంగళవారం ప్రపంచ క్షయ నివారణ దినం సంద ర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు ఉండి, సాయంత్రం వేళ జ్వరం ఉంటే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిల్లో చికిత్స చేయించుకో వాలన్నా రు.
వ్యాధి సోకిన వారికి మందులు అందిస్తారన్నారు. ఆరోగ్యశాఖ సూచనలు పాటి స్తూ క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు. అలాగే టీబీ పాజిటివ్ ఉన్నవారికి పౌష్టికాహారం కోసం నిశ్శయ్ పోషణ యోజన క్రింద ప్రతినెల వారి అకౌంట్లో రూ.1000లు జమ చేయడం జరుగుతుం దన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఆసుపత్రి సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.




