24 March, 2026 | 8:14 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలి

24-03-2026 06:37 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో పాఠశాల విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ నాయకులు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కే. హరితకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించడం నిరాశాజనకమని తెలిపారు. 1964 కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం విద్యకు కనీసం 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 8.22 శాతం మాత్రమే కేటాయించడం వల్ల విద్యాభివృద్ధికి ప్రతికూల ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గిపోవడం, మౌలిక సదుపాయాల లోపం కారణంగా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. తగిన నిధులు లేకుండా నాణ్యమైన విద్య అందించడం కష్టమని పేర్కొన్నారు. 2024 మార్చి నుంచి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షన్ ప్రయోజనాల విడుదల, టీచర్ల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ఫిట్‌మెంట్ ప్రకటన, కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, టీచర్ల పెండింగ్ బిల్లులు, డీఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.