24 March, 2026 | 8:49 PM

కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు

24-03-2026 07:20 PM

– రోడ్డుపై మోరి నీళ్లు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని 10వ వార్డ్‌లో పారిశుధ్య పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. డ్రైనేజ్ (మోరి) నీళ్లు రోడ్లపైకి రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై మురుగు నీరు నిల్వ ఉండటంతో నడవడానికి కూడా వీలుకాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం రోజు కురిసిన భారీ వర్షానికి పరిస్థితి మరింత విషమించింది.

మురుగు నీరు రోడ్డంతా వ్యాపించి, చెత్తతో కలిసి దుర్వాసన వస్తోంది. దీనివల్ల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కాలని వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పాలకవర్గం, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మోరి నీళ్లు రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.