26 March, 2026 | 4:26 PM

Breaking News

పిల్లలు తస్మాత్ జాగ్రత్త! హైదరాబాద్‌లో పిల్లలు తినే ఐస్‌క్రీమ్స్ కల్తీ..!   •   బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •  

బీహార్ ఎన్నికలకు జేఎంఎం దూరం

22-10-2025 12:53 AM

కాంగ్రెస్, ఆర్జేడీ కుట్ర కారణంగానే పోటీ నుంచి వైదొలిగామని ఆరోపణ

పాట్నా, అక్టోబర్ 21 : ఝార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించింది. ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన మరుసటి రోజే కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్, ఆర్జేడీ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘మహాఘట్ బంధన్’ కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయని జేఎంఎం ఆరోపించింది.

ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో ఉన్న పొత్తును పార్టీ సమీక్షిస్తుందని జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ తెలిపారు. ‘రాజకీయ కుట్రలో భాగంగా బీహార్ ఎన్నికల్లో జేఎంఎం పోటీ చేయకుండా కాంగ్రెస్, ఆర్జేడీ అడ్డుకున్నాయి.. ఆ పార్టీలే దీనికి బాధ్యత వహించాలి. వారికి మా పార్టీ సమాధానం ఇస్తుంది. ఆ పార్టీలతో ఉన్న పొత్తును సమీక్షిస్తుంది’. అని సుదివ్య కుమార్ పేర్కొన్నారు.