17-02-2026 03:50:03 PM
జగదేవపూర్,(విజయంక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి గజ్వెల్ శాసన సభ్యులు కేసీఆర్ జన్మదిన వేడుకలు సర్పంచ్ దిన రాజలింగం, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్బంగా పాఠశాల విద్యార్థులు కూర్చోవడానికి కార్పెట్లు అందచేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు స్వామి, యాదగిరి,నాయకులు నవీన్, అనిల్, నాగరాజు, శ్రీనివాస్, పర్వతాలు, ప్రవీణ్, హేమంత్, పార్టీ సీనియర్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.