16 May, 2026 | 1:54 PM

గ్రామాల్లో జనగణ చైతన్య యాత్ర

16-05-2026 01:12 PM

కేసముద్రం, (విజయక్రాంతి): జన గణన కార్యక్రమానికి ప్రజలంతా పాల్గొని, జనగణలో సర్వే అధికారులు కోరిన సమాచారం ఇచ్చి, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి సహకరించాలని కోరుతూ తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇనుగుర్తి మండలంలో శనివారం కళాబృందం సారథి మునుకుంట్ల ఐలేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు జనగణన కార్యక్రమం సులువుగా అర్థమయ్యే విధంగా కళారూపాలతో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు కంబాలపల్లి సత్యనారాయణ, మెరుగు రవీందర్ గౌడ్, బక్కి యాదయ్య, దేశెట్టి ప్రవీణ్ కుమార్, దర్శనం యుగంధర్, సాసు పరమేష్ ,ఆరేపల్లి నరేష్, పీ.బిక్షపతి, వజ్జ రాజ్యలక్ష్మి, రోజా, కొదుమూరి కీర్తి పాల్గొన్నారు.