జనం పక్షాన జన సమితి
- తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
- ముషీరాబాద్‌లో ఘనంగా జన సమితి ఆవిర్భావ వేడుకలు
ముషీరాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): తెలంగాణ జన సమితి ఎనిమిదేళ్లు గా జనం పక్షాన నిలబడి నిలదొక్కుకున్నదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫె సర్ కోదండరాం పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్ గుండు, రాంనగర్ మీసేవ ప్రాంతాలలో పార్టీ ఆవిర్భావ వేడుకలు బుధవారం ఘనం గా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ డబ్బు కేంద్రంగా ఉన్న ప్రస్తుత రాజకీయాలలో ప్రజల పక్షాన, ప్రజా సమస్యలపై అనునిత్యం గొంతు ఎత్తు తూ నిలబడిన పార్టీ జన సమితి పార్టీ అని అన్నారు. 8 ఏళ్ల కాలంలో ఆదివాసీల పక్షాన రైతుల పక్షాన నిరుద్యోగులకు అండగా కార్మికులకు చేదోడు వాదోడుగా పనిచేస్తూ ప్రజా సమస్యలే వేదికగా ఉద్యమిస్తున్న పార్టీ తెలంగాణ జన సమితి అని అభిప్రాయపడ్డారు.
నగర కమిటీ ఉపాధ్యక్షుడు పునిరెడ్డి జైపాల్ రెడ్డి, అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు కాకునూరి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆవిర్భావ వేడుకలకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నరసయ్య, ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, ముషీరాబాద్ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు జస్వంత్ కుమార్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు జి. రవీందర్ యాదవ్, ముషీరాబాద్ నియోజకవర్గం జన సమితి నాయకులు మహేష్, శంకర్ సత్యనారాయణ, రమాకాంత్, మ హేందర్, పార్టీ నగర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, రవికాంత్, సురేష్, సదానంద్, శివ , కుమార్, ప్రభాకర్ పాల్గొన్నారు.






