24 June, 2026 | 11:07 AM

గ్రామస్తులకు అండగా దన్నూర్ పంచాయతీ కారోబార్

24-06-2026 10:00 AM

దరఖాస్తులు పరిశీలించి పంపుతాడు... 

బోథ్,జూన్, 24 (విజయక్రాంతి): మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీలో సతీష్ కుమార్ గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. చాలీసాలను జీతంతో విధులు నిర్వహిస్తున్న ఈయన తనతో అయినంత గ్రామస్తులకు సేవ చేయాలనుకున్నాడు. అయితే ఎంతోమంది చదువురాని వారు కళ్యాణ లక్ష్మి, పెన్షన్, వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.

అనేకమంది గ్రామస్తులు దరఖాస్తులలో తప్పులు నింపడంతో దరఖాస్తు లు తిరిగి వస్తున్నాయి. చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి గ్రామ కార్యదర్శిగా తన వంతు సహకారం చేసినందుకు ముందుకు వచ్చాడు. గ్రామంలోని ప్రజలు వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటే ముందుగా ఈయనని సంప్రదిస్తుంటారు. వచ్చిన వారికి దరఖాస్తులు అన్నింటి వివిధ శాఖల వారికి చేరే విధంగా చూస్తున్నారు. ఈయన చేస్తున్న సహకారం మిగతా గ్రామాల ప్రజలకు ఆదర్శంగా ఉంది. సేవ దృక్పథం తో పనిచేస్తున్న ఈయనను కొలువులు గ్రామస్తులు అభినందిస్తున్నారు