30 April, 2026 | 4:12 AM

ఒలంపియాడ్ ప్రతిభా పరీక్షల్లో సత్తా చాటిన చిన్న మల్లారెడ్డి విద్యార్థులు

30-04-2026 01:23 AM

హైదరాబాద్ హైటెక్ సిటీలో పురస్కారమందుకున్న విద్యార్థులు

కామారెడ్డి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఒలంపియాడ్ ప్రతిభ పరీక్షల్లో కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి విద్యార్థులు సత్తా చాటారు.శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన గణిత ఒలంపియాడ్ ఎక్స్లెన్స్ అవారడ్స్-2026 లో చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు  విజయగిరి రామకృష్ణని రాష్ట్రస్థాయిలో ఉత్తములుగా నిలిచిన విద్యార్థులు ఓంకార్ , నందీశ్వర్లు హైదరాబాదులోని శిల్పకళ వేదికగా ఈ పురస్కారాలు అందుకున్నారు.  చుక్కా రామయ్య  మార్గదర్శకత్వంలో సంస్థ అధ్యక్షులు తుమ్మ అమరేష్  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఒలంపియాడ్ పరీక్షలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతు విద్యార్థులలో అంతరంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి పోటీ పరీక్షలు అంటే భయాన్ని పోగొట్టాలనే సదుద్దేశంతో  నిర్వహించబడుతున్నటువంటి ఇలాంటి పరీక్షలు రాయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. రామకృష్ణ విద్యార్థులచే  ఒలంపియాడ్ పరీక్షలు రాయిస్తూ, భవిష్యత్తులో ఏ పరీక్ష లోనైనా అయినా సులభంగా విజయం సాధించేలా పాఠశాల స్థాయి నుండే  ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్ నేర్పిస్తూ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.ఉపాధ్యాయులు రామకృష్ణని, విద్యార్థులు ఓంకార్, నందీశ్వర్ లను ప్రధానోపాధ్యాయులు  కే సాయిరెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.