30 April, 2026 | 4:04 AM

దివ్యాంగులకు ట్రై మోటరైజడ్ స్కూటీలు పంపిణీ

30-04-2026 01:24 AM

నిజామాబాద్, ఏప్రిల్ 29(విజయ క్రాంతి) : బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దివ్యాంగులకు ట్రై మోటరైజడ్ స్కూటీలు, బ్యాటరీ సైకిళ్లు, బిజినెస్ ఏంపవర్ కార్ట్లు, బిజినెస్ ఆటోలు, మోటార్ సైకిళ్ళు, ల్యాప్ ట్యాపులు, సహాయ ఉపకరణాలను మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ మంత్రి వర్యులు సీతక్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఎమ్మెల్యే లు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి లు, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ చైర్మన్ లు అన్వే ష్ రెడ్డి, తాహిర్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,

అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్ చేతులు మీదుగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మ అధ్యక్షతన తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో 75 స్కూటీలు, మొత్తం గా 140 మంది వికలాంగుల కి ఉపకారణాలు స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు, బిజెనెస్ ఎంపవర్ కారట్స్, లాప్టాప్ లు పంపిణీ చేయడం జరిగింది.  ఈ సందర్బంగా మంత్రివర్యులు సీతక్క మాట్లాడుతూ వికలాంగుల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలియజేశారు  దివ్యాంగుల ఆత్మ గౌరవంతో బ్రతకడం ఏకైక లక్ష్యం గా ప్రజా పాలన ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు. వికలాంగుల నిరుద్యోగుల కోసం జాబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని, వికలాంగుల అంగ వైఖల్యం నిర్దారణ కోసం అత్యాధునిక పరికరాలు కోసం 20 కోట్లు వెచ్చించామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులను గుర్తించి వచ్చే బడ్జేట్ లో స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు మంజూరు చేస్తామన్నారు.