బంజర గ్రామంలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారమ్ ఏర్పాటు
24-06-2026 09:43 AM
ఎర్రుపాలెం జూన్ 23 (విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలం బంజర గ్రామంలో నూతన విద్యుత్తు ట్రాన్స్ఫారమును ఏర్పాటు చేసినట్లు ఏ ఈ జి అనుష తెలియజేశారు. బంజర గ్రామ సర్పంచ్ వేమిరెడ్డి అన్నపూర్ణ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ వారు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్ ఫారం ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజల లో వోల్టేజ్ సమస్య పూర్తిగా పరిష్కరించడమైనదని సర్పంచి అన్నపూర్ణ ప్రారంభించి మాట్లాడారు. జేఎల్ఎం అనంతరావు,వెమిరెడ్డి సంజీవ్ రెడ్డి , ఉపసర్పంచ్ ,వార్డు సభ్యులు ,మాజీ సర్పంచ్,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






