గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఏర్పాటు
24-06-2026 09:52 AM
నాగిరెడ్డిపేట్,జూన్ 24 (విజయక్రాంతి): మండలంలోనిమాల్తుమ్మెద,పోచారం, వాడి,లింగంపల్లి,బంజారా తండా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామ అధ్యక్షుల వైస్ ప్రెసిడెంట్లని, యూత్ అధ్యక్షులు,సోషల్ మీడియా,బీసీ సెల్ ఎస్సీ సెల్,ఎస్టీ సేల్ మైనారిటీ సెల్ నాయకులని ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రభాకర్,బీసీ సెల్ ప్రెసిడెంట్ సాయా గౌడ్,మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ కుష్బూదిన్, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో అందరూ కలిసి కట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేస్తూ,ప్రజల అందరికీ సంక్షేమ పథకాలను అందేలా చూడాలని చూచన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






