రైతు వేదికలలో విత్తన మేళా
24-06-2026 09:50 AM
నాగిరెడ్డిపేట్,జూన్ 24 (విజయక్రాంతి): ఈ నెల 23 నుండి తేదీ నుండి 30 తేదీ వరకు రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించడం జరుగుతుంది.ఈ విత్తన మేళాలో మండలంలోని విక్రయదారులు ప్రభుత్వం సిఫారసు చేసిన సన్న వడ్లు విత్తనాలు,నానో యూరియా, నానో డి.ఏ.పిలు రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.ఈ సన్న రకాల వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రత్యేక బోనస్ అందిస్తున్నందున,రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు.కావున రైతు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.ఈ కార్యక్రమంలో ఏవో, సాయి కిరణ్,ఆత్మ డైరెక్టర్లు దివిటీ కిష్టయ్య,తలారి లక్ష్మణ్ ఠాగూర్,పసులది కిష్టయ్య మరియు రైతులు పాల్గొన్నారు.






