ప్రారంభమైన మొహరం పండుగ వేడుకలు
24-06-2026 10:38 AM
బోథ్, జూన్ 24(విజయక్రాంతి): మండలంలో మొహర్రం పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. కులమతాలకు అతీతంగా జరుగుతున్న ఈ వేడుకలు నెలవంక ప్రారంభం నుండి ప్రారంభమయ్యాయి. నెలవంకను చూసిన రోజు పీర్ల బంగ్లాల ముందు గుండం తవ్వకాలు చేపట్టారు. మంగళవారం రాత్రి పీర్ల ఊరేగింపు నిర్వహించారు మరో రెండు రోజుల్లో మొక్కులు చెల్లించి నైవేద్యాలను సమర్పిస్తారు. ఆ తర్వాత తెల్లవారుజాము న రోజంతా పీర్ల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది అనంతరం పండుగ వేడుకలు ముగిస్తాయి.






