7 May, 2026 | 1:29 AM

రైతులను సన్మానించిన జమ్మికుంట

07-05-2026 12:41 AM

 వ్యవసాయ మార్కెట్  పర్సన్ 

జమ్మికుంట మే6 (విజయ క్రాంతి) తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న- సదానందం రైతులను సన్మానించారు. బుధవారం మార్కెట్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలను నిర్వహించారు.

వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ మాట్లాడుతూ..... కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో రైతు చనిపోతే రూ. లక్ష, లేదా శాశ్వత అంగవైకల్యం అయితే రూ.75 వేలు, తాత్కాలిక అంగవైకల్యం జరిగినట్లయితే రూ. 25 వేల బీమా అందించడం జరుగుతుందన్నారు.

అనంతరం రైతులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఎన్. రాజా , వైస్ ఛైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి , కమిటీ సభ్యులు శ్రీపతి రెడ్డి, సునీల్, సతీష్, రాజేశ్వర రావు, సదానందం, సురేష్, దీక్షిత్, శ్రీనివాస్ రెడ్డి, రషీద్ పాషా, తిరుపతి, శ్యామ్ కుమార్, శ్రీనివాస్ లతోపాటు కేడిసిసి బ్యాంక్ , ప్యాక్స్ , సహకార బ్యాంక్ , అగ్రికల్చర్ సిబ్బంది, వ్యాపారస్తులు, కార్మికులు, రైతులు పాల్గొన్నారు.