6 April, 2026 | 2:44 AM

జగ్జీవన్ రామ్ కృషి మరువలేనిది

06-04-2026 12:59 AM

సనత్‌నగర్/జూబ్లీహిల్స్/పంజాగుట్ట/బడంగ్‌పేట్/సికింద్రాబాద్, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి):- సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధు డు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సనత్‌నగర్ డివిజన్లో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి జీ.వి. సుమన్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ చౌక్ నెహ్రూ పార్క్ వద్ద ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ ముదిరాజ్, సీనియర్ నాయ కులు లింగంపల్లి నర్సింగ్ రావు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొన్న బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి డాక్టర్ పద్మ వీరపనేని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

పంజాగుట్ట పరిధిలోని నిమ్స్ ఆసుపత్రిలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిమ్స్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో నిమ్స్ ఎస్సీ అండ్ ఎస్టీ లైజన్ ఆఫీసర్ రవి కుమార్, అసోసియేషన్ అధ్యక్షురాలు కేజియా, ప్రధాన కార్యదర్శి సేవా నాయక్, డాక్టర్ చంద్రశేఖర్, వీరితో పాటు సీనియర్ సభ్యులు వెంకటరత్నం, పవన్, కుమార్, ప్రీతి భార్గవి, లక్ష్మణ్, వినీత్, జ్యోతి, దివ్య, శివ, యూసుఫ్ సహా పెద్ద సంఖ్యలో నర్సింగ్ విద్యార్థులు,

ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. బడంగ్‌పేట్‌లో మాజీ ప్రధాని, సంఘసంస్కర్త, స్వతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రావ్ సేవలు చిరస్మరణీయమని కాంటెస్ట్ ఎమ్మెల్యే టీపీసీసీ కార్యదర్శి యేల్మేటి అమరేందర్ రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రావు 118 జయంతి పురస్కరించుకొని.. ఆదివారం మహేశ్వరం నియో జకవర్గం బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని మల్లాపూర్, బడంగ్ పేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అమరేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి, చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమములో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, ఎర్ర దర్శన్,  ఎస్సీ సెల్ చైర్మన్ కుమార్, గట్టు బాలకృష్ణ, పుట్టగల జగన్ , మహేశ్వరం నియోజకవర్గం  ఎస్సీ సెల్ అధ్యక్షుడు క్యారగారి శ్రీధర్,  శ్రీను, బొర్ర రవికుమార్ , సుధాకర్, ప్రవీణ్ వరికుప్పల వెంకటేష్, వంగేటి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరిధిలో భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గాంధీ భవన్, బేగంపేట్ డివిజన్ పాటిగడ్డతో పాటు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కోట నీలిమ అయన విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.