15 June, 2026 | 6:09 PM

Breaking News

ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •   యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం   •   దత్తతతో చిన్నారుల జీవితాల్లో వెలుగులు   •  

శాంతిఖని లో ప్రమాదం.. ఒకరికి స్వల్ప గాయాలు

15-06-2026 05:20 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని బొగ్గు గనిలో మొదటి షిప్టులో గని ప్రమాదం లో ఓ కార్మికుడికి స్వల్ప గాయమైంది. వివరాలిలా ఉన్నాయి. 37 లెవల్లో సోము అనే జనరల్ అసిస్టెంట్ కార్మికుడు సపోర్టింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో  సపోర్టింగ్ కోసం డ్రిల్ చేసి బోల్ట్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు చేతివేలు అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో చేతి వేలికి తీవ్రంగా గాయమైంది. వెంటనే తోటి కార్మికులు గాయపడిన కార్మికుడిని గని ఉపరితలానికి తీసుకొచ్చారు. అధికారులు సదరు కార్మికుడిని వెంటనే బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అడ్మిట్ చేసుకుని  వైద్యులు  చికిత్స అందించారు.