అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. వ్యతిరేకించిన ఇజ్రాయెల్
15-06-2026 05:05 PM
జెరూసలేం: అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక శాంతి( US-Iran peace agreement) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకింది. సరిహద్దుల వెంబడి సైన్యాన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్(Israel ) తేల్చిచెప్పింది. బలగాల ఉపసంహరణకు విధించిన గడువు పాటించబోమని తెలిపింది. ఇదే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెప్పినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. దేశ భద్రత, సైన్యం మోహరింపుల్లో మార్పు ఉండబోదని ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్, సిరియా, గాజా సరిహద్దుల్లో దళాల మోహరింపు కొనసాగుతోందని ఇజ్రాయెల్ తెలింది. ఒత్తిళ్లున్నా లెబనాన్ నుంచి వైదొలగడాన్ని తిరస్కరించింది.






